Search This Blog

Free Online Currency Converter

Sunday, April 17, 2016

Virat Kohli and Gautam Gambhir | Virat Kohli fights with all

బెంగుళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మే 4కు ఒక ప్రత్యేకత ఉంది. ఐపీఎల్ 6వ ఎడిషన్‌లో భాగంగా సరిగ్గా రెండు సంవత్సరాలు క్రితం విరాట్ కోహ్లీ, గౌతమ్ గంబీర్‌లు ఇద్దరూ బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో గొడవపడిన సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం వీరిద్దరూ గొడవ పడేందుకు అవకాశం రాలేదు. ఎందుకంటే టోర్నమెంట్లో ఇప్పటికే ఈ రెండు జట్లు కూడా రెండు మ్యాచ్‌లను ఆడేశాయి. ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో కూడా బెంగుళూరే విజయం సాధించింది. మే 2 బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు జట్టు కోల్‌కత్తాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ని 10 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. టోర్నమెంట్లో అంతక ముందు ఏప్రిల్ 11న జరిగిన ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కూడా బెంగుళూరే 3 వికెట్ల తేడాతో కోల్‌కత్తాపై విజయం సాధించింది. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భావోద్వేగాలను దాచుకోలేని విషయం తెలిసిందే. బెంగుళూరు జట్టు సొంత మైదానంలో 2013లో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో బెంగుళూరు ఆటగాడు మాన్విందర్ సింగ్ చివరి ఓవర్‌లో కొట్టిన వరుస సిక్సులతో బెంగుళూరు విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం మైదానంలో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్‌ల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవను మీడియా ఎంతో అధ్బుత నైపుణ్యంతో కెమెరాల్లో బంధించింది. కాగా, ఈ ఏడాది టోర్నమెంట్లో ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. దీంతో మరోసారి విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ గొడవపడే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇరు జట్లు కూడా ఫ్లే ఆఫ్స్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉండటంతో అక్కడేమైనా తలపడతాయో చూద్దాం. కోహ్లీ, గంభీర్ ఇద్దరు కూడా ఢిల్లీకి చెందిన వారు కావడం విశేషం.





No comments:

Post a Comment